‘మోసగాళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్

Manchu Vishu And Kajal Aggarwal Starrer Mosagallu Movie Release Date Announced,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Manchu Vishu and Kajal Aggarwal Starrer Mosagallu,Mosagallu,Mosagallu Movie,Mosagallu Film,Mosagallu Telugu Movie,Mosagallu Movie Latest News,Mosagallu Update,Mosagallu Movie Latest Update,Mosagallu Movie Release Date Announced,Manchu Vishu Mosagallu Movie Release Date,Mosagallu Movie Release Date,Mosagallu Release Date,Mosagallu Release Date Out,Mosagallu Release Date Out Now,Mosagallu Release Date Announcement,Manchu Vishu And Kajal Aggarwal Starrer Mosagallu Release Date,Suniel Shetty,Mosagallu On 19th March,Mosagallu Movie Release On March 19th,Mosagallu From March 19th,Mosagallu World Wide March 19th Release,Manchu Vishu New Movie Release Date

ఎన్నో ఏళ్ల నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. అందుకే ఈసారి రొటీన్ కు భిన్నంగా ఉండే కథను సెలెక్ట్ చేసుకొని మోసగాళ్ళు అనే కథతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిజానికి ఈసినిమా గురించి మొదట్లో పెద్దగా బజ్ లేకపోయినా.. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. ఇప్పుడు ఈసినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మొహన్ బాబు తన ట్వట్టర్ ద్వారా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు. మార్చి 19వ తేదీన ఈసినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

కాగా నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహాని సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.