‘గాలి సంపత్’ నా జీవితంలో ఒక ఆణిముత్యం – రాజేంద్ర ప్రసాద్

Gaali Sampath Is One Of The Milestone Movies Of My Film Career Says Rajendra Prasad,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Rajendra Prasad Excellent Speech,Gaali Sampath Movie Pre Release Event,Sree Vishnu,Anil Ravipudi,Rajendra Prasad Excellent Speech At Gaali Sampath Pre Release Event,Gaali Sampath Movie Pre Release Event,Ram Pothineni,Rajendra Prasad,Gaali Sampath Trailer,Gaali Sampath Songs,Gaali Sampath Teaser,Gaali Sampath Movie,Gaali Sampath Movie Event,Sree Vishnu Movies,Sree vishnu,Gaali Sampath Movie Interview,Gaali Sampath Pre Release Event,Rajendra Prasad Speech Gaali Sampath,Sree Vishnu Speech Gaali Sampath,Ram Pothineni Speech,Rajendra Prasad Honest Speech,Rajendra Prasad Speech Gaali Sampath,Gaali Sampath Telugu Movie Pre Release Event,Rajendra Prasad Speech At Gaali Sampath Pre Release Event

43 ఏళ్లు టెస్ట్ చేసి గాలి సంపత్ సినిమా నా కోసంరాసినట్టు ఉంది అంటున్నారు నట కిరిటీ రాజేంద్రప్రసాద్. అనీష్ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ – శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా గాలి సంపత్. ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిన్న ఘనంగా నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ – “గాలి సంప‌త్ సినిమా చూశాక జీవితంలో నాకు రెండు మూడు విష‌యాలు అర్ధమయ్యాయి. జీవితంలో మనం ఏం చేసినా భ‌గ‌వంతుడు మ‌న‌కు ఇచ్చే అవ‌కాశం. అది రానిదే ఎవ‌రూ జీవితంలో ఏమీ చేయ‌లేరు. 44 సంవ‌త్స‌రాల సినిమా జీవితం.. న‌న్ను న‌టుడిగా నిల‌బెట్టిన మొద‌టిసినిమా లేడిస్ టైల‌ర్‌. ఆ సినిమా లేక‌పోతే నేను లేను. నా లాంటి కళాకారుడికి ఈసినిమా ద్వారా ఒక అవకాశం రావడం.. మరి ముఖ్యంగా టెస్ట్ లు చేసి చేసి 43 సంవత్సరాలు నన్ను చూసి రాసినట్టున్నాడు సాయి అనబడే ఎస్.కృష్ణ. నా జీవితంలో జ‌న్మాంతం న‌టుడిగా గుర్తించుకునే ఒక అద్భుత‌మైన‌ క‌థ రాశారు సాయి. ఆ క‌థ‌కి ఆయ‌న్నే నిర్మాత‌గా మార్చారు న‌న్ను డాడీ అని పిలిచే అనిల్ రావిపూడి. అద్భుతాలు జరుగుతాయి అది కూడా ఆక్సిడెంట్ గా జరుగుతాయి అని ఈసినిమా చేశాక నాకు అర్ధమైంది. ఈ క‌థ చెప్ప‌గానే నేను భ‌య‌ప‌డ్డాను. మాట‌లు లేకుండా ఎలా అనుకున్నాం. కానీ క‌రోనా త‌ర్వాత టీమ్ మొత్తం ఫుల్ ఎన‌ర్జీతో పాత్రను తీర్చిదిద్దారు. ఈకథలో నాకు చాలా చాలా ఇష్టంగా కష్టపడుతున్నప్పటికీ కూడా అది కూడా ఎంతో గొప్ప అవకాశం కాబట్టి చేసేశాను. నాకు ఈసినిమాలో కో ఆర్టిస్టుల వల్ల చాలా హెల్ప్ జరిగింది ముఖ్యంగా నా కొడుకు శ్రీవిష్ణు. నిజంగా ఈ సినిమా చూసిన తరువాత మేమిద్దరం నటించామని చెప్పరు. నా జీవితంలో మ‌ర్చిపోలేని సినిమా ఇది. సత్య బాగా చేశారు. ల‌వ్‌లీ సింగ్ బాగా చేసింది. అనీష్ అద్భుతంగా తెర‌కెక్కించాడు. గాలి సంప‌త్ నా జీవితంలో ఒక ఆణిముత్యం అన్నారు.

కాగా ఈ మూవీని ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఇంకా ఈ సినిమాలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =