టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే ఇంకెవరూ ఉప్పెన భామా కృతిశెట్టి అని టక్కున చెప్పొచ్చు. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తాన్ని తన మాయలో పడేసింది ఈభామ. సినిమా రిలీజ్ కాకముందే ఈ హీరోయిన్ ను పలు అవకాశాలు వరించాయంటేనే చెప్పొచ్చు ఎంత క్రేజ్ తెచ్చుకుందో. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఈ అమ్మడి డైరీలోకి మరో సినిమా వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆవారా, పందెంకోడి వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.లింగుసామి దర్శకత్వంలో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ కు జోడీగా కృతి శెట్టి నటించనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమాలో కృతి శెట్టినే హీరోయిన్ గా నటిస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు.

కాగా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషలలో రూపొందించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనుండగా… ఈ సినిమాలో నటించే నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























