
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 34


నెగటివ్ రోల్ లో నటించాలని ఉంది - మీనా

హైదరాబాద్ సెట్ లో "లైగర్ "షూటింగ్

కృతిశెట్టి న్యూ టాలెంట్

నాని 'గ్యాంగ్ లీడర్' 3 భాషల్లో రీమేక్..!

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి

ప్రతీ మూవీ "బాహుబలి "కాదు - తమన్నా

వైష్ణవ్ తేజ్ ఫేవరేట్ హీరో , హీరోయిన్ , మూవీ

జూలై నెలాఖరులో సెట్స్ పైకి "ఆచార్య "

'రాజ రాజ చోర' అప్ డేట్స్ తో రెడీ

బాలకృష్ణకు చిరు, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

మరో మంచి పనికి చిరంజీవి శ్రీకారం

సోనూసూద్ కోసం పాదయాత్ర

సెలబ్రిటీ స్టేటస్ అంటే .. రాశీఖన్నా

"ఖైదీ " హిందీ రీమేక్ లో కాజల్ అగర్వాల్

హెబ్బా పటేల్ స్టన్నింగ్ లుక్

'విక్రమ్ 60'.. సగం షూటింగ్ పూర్తయింది

ఫ్రంట్ లైన్ వారియర్స్ కై నాని సమ్ థింగ్ స్పెషల్

కాజల్ అగర్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ "ఖైదీ "తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నెగటివ్ రోల్ లో నటించాలని ఉంది - మీనా
తమిళ , తెలుగు , మలయాళ , హిందీ భాషలలో బాల నటిగా సుమారు 45 మూవీస్ లో నటించిన మీనా 1989సంవత్సరం లో "ఒరు పుదియ కథై "మూవీ తో కోలీవుడ్ , "నవయుగం "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "సీతారామయ్య గారి మనవరాలు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

హైదరాబాద్ సెట్ లో "లైగర్ "షూటింగ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

కృతిశెట్టి న్యూ టాలెంట్
“ఉప్పెన “మూవీతో కృతి శెట్టి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. "ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, 100 కోట్ల క్లబ్ లో చేరింది. ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

నాని 'గ్యాంగ్ లీడర్' 3 భాషల్లో రీమేక్..!
పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను మనం ఎలా రీమేక్ చేసుకుంటున్నామో.. తెలుగులో హిట్ అయిన సినిమాలు ఇప్పుడు పలు భాషల్లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలు ముఖ్యంగా బాలీవుడ్ లో మన తెలుగు సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే న్యాచురుల్ స్టార్ నాని క్రికెట్ నేపథ్యంలో నటించిన జెర్సీ సినిమా హిందీలో రీమేక్ అవుతుండగా.. ఇప్పుడు మరో సినిమా రీమేక్ అవుతున్నట్టు తెలుస్తుంది. అది నాని- విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా.

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 "మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ తో వస్తాం..!
ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి
మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కరోనా పరిస్థితుల్లో కూడా ఇటలీ షెడ్యూల్ ను చాలా కష్టపడి ముగించుకొని వచ్చారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లకు ప్లాన్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టు తెలుపుతున్నాడు విక్రమ్.

ప్రతీ మూవీ "బాహుబలి "కాదు - తమన్నా
"బాహుబలి ", "బాహుబలి 2 ", "సైరా నరసింహా రెడ్డి " వంటి భారీ బడ్జెట్ మూవీస్ లో తమన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్ తో పలుసూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ ఫేవరేట్ హీరో , హీరోయిన్ , మూవీ
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక మూవీ కి , ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ బ్యానర్ లో ఒక మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

జూలై నెలాఖరులో సెట్స్ పైకి "ఆచార్య "
మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్…

'రాజ రాజ చోర' అప్ డేట్స్ తో రెడీ
కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ లు, రిలీజ్ ఆగిపోవడమే కాదు.. తమ సినిమాల నుండి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడంలేదు. ప్రస్తుతం పరిస్థితులు కూడా బాలేదు కనుక మేకర్స్ కావాలనే అప్ డేట్స్ కూడా ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పూర్తిగా కాకపోయినా కాస్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది ప్రమోషన్ కార్యక్రమాలు అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఈనేపథ్యంలోనే శ్రీవిష్ణు తన సినిమా అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు.

బాలకృష్ణకు చిరు, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్
మొత్తానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వచ్చేసింది. బాలకృష్ణ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భగా బాలకృష్ణకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అందరూ. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. మరోవైపు తన సినిమాల అప్ డేట్లతో సోషల్ మీడియాలో నందమూరి హడావుడి మొదలైంది.

మరో మంచి పనికి చిరంజీవి శ్రీకారం
మెగా స్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి ప్రజలకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ లో సినీ కార్మికులకు కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో నిత్యావసర వస్తువులు అందజేశారు. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా బాధితులకు సకాలం లో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యం తో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లా కు ఒక ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.

సోనూసూద్ కోసం పాదయాత్ర
గత ఏడాది కాలంగా దేశంలో ఎక్కడ చూసినా కూడా సోనూసూద్ పేరు మారు మ్రోగి పోతుంది. ఎన్నో సినిమాల్లో రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూసూద్.. కరోనా వల్ల రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు.గత ఏడాది నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తుండగా.. ఎంతోమంది కరోనా బాధితులకు తనవంతూ సహకారం అందిస్తూ.. సాయం అడిగిన వారికి కాదనకుండా నేటి కర్ణుడిగా పేరుతెచ్చుకున్నది మాత్రం సోనూసూద్.ఇక సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు.

సెలబ్రిటీ స్టేటస్ అంటే .. రాశీఖన్నా
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచి పోయినా ఇటలీ లో జరిగిన “థ్యాంక్ యు” మూవీ షూటింగ్ లో రాశీఖన్నా పాల్గొన్నారు. లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

"ఖైదీ " హిందీ రీమేక్ లో కాజల్ అగర్వాల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ "ఉమ " కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

హెబ్బా పటేల్ స్టన్నింగ్ లుక్
"అధ్యక్ష"కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన హెబ్బా పటేల్ "అలా ఎలా "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు."కుమారి 21 F ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అంధగాడు "వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "భీష్మ "మూవీ లో అతిథి పాత్రలో , "RED " మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.

'విక్రమ్ 60'.. సగం షూటింగ్ పూర్తయింది
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోతమిళ స్టార్ హీరో విక్రమ్ 60వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. దీంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఫ్రంట్ లైన్ వారియర్స్ కై నాని సమ్ థింగ్ స్పెషల్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీలో నటిస్తున్నారు . కరోనా సెకండ్ వేవ్ కారణంగా “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది.