కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ లు, రిలీజ్ ఆగిపోవడమే కాదు.. తమ సినిమాల నుండి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడంలేదు. ప్రస్తుతం పరిస్థితులు కూడా బాలేదు కనుక మేకర్స్ కావాలనే అప్ డేట్స్ కూడా ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. పూర్తిగా కాకపోయినా కాస్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది ప్రమోషన్ కార్యక్రమాలు అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఈనేపథ్యంలోనే శ్రీవిష్ణు తన సినిమా అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ” రాజ రాజ చోర”. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కు కొంతకాలంగా బ్రేక్ పడింది.
అయితే ఇప్పుడు మళ్లీ అప్ డేట్స్ షురూ చేస్తున్నట్టు తెలుపుతున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వతోనే ఆ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. గంగవ్వ కూడా ఈసినిమాలో ఒక పాత్ర పోషించడంతో ఆమెతో ప్రచారం మొదలుపెడుతూ ఒక ఫన్నీ వీడియో వదిలారు మేకర్స్. రాజ రాజ చోర మూవీ అప్ డేట్స్ ఏవీ? అని శ్రీవిష్ణు అడుగుతుంటే… నువ్వు లేకపోయినా వాటిని సిద్ధం చేశానంటూ గంగవ్వ సమాధానం ఇస్తుంది. కాస్త మంచివి చూసి వదులు అని శ్రీవిష్ణు రిక్వెస్ట్ చేస్తాడు. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను చోర గాథ పేరుతో ఈ నెల 11న జనం ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.
Mana Gangavva aka Anjamma #RajaRajaChora update tho ready ga undi…Mari meeru ready na?#ChoraGadha a quirky tale on June 11.@sreevishnuoffl @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @hasithgoli @TheSunainaa @akash_megha #VivekSagar @peoplemediafcy @AAArtsOfficial #RRC pic.twitter.com/TDoEcvNa4G
— People Media Factory (@peoplemediafcy) June 9, 2021
కాగా మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: