‘విక్రమ్ 60’.. సగం షూటింగ్ పూర్తయింది

Director Karthik Suvvaraj Releases An Interesting Update On Vikram 60 Movie Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Karthik Suvvaraj,Director Karthik Suvvaraj,Vikram 60,Vikram 60 Movie Shooting Work,Vikram 60 Movie,Vikram 60 Movie Shooting,Vikram 60 Movie Shooting Update,Vikram 60 Movie Shooting News,Vikram 60 Movie Shooting Latest News,Vikram 60 Movie Shooting Latest updates,Vikram 60 Movie Shooting Details,Vikram,Actor Vikram,Hero Vikram,Vikram Movies,Vikram New Movie,Vikram Vikram Latest Movie,Vikram's Vikram 60 Movie,Vikram New Movie Updates,Vikram Latest Movie Updates,Vikram 60 New Update,#Vikram60

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోతమిళ స్టార్ హీరో విక్రమ్ 60వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. దీంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా.. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ.. లాక్ డౌన్ కు ముందే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది.. త్వరలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించాలని చూస్తున్నాం.. తమిళనాడులో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయగానే షూటింగ్‌ తిరిగి ప్రారంభిస్తాం.. న్యూ షెడ్యూల్‌లో విక్రమ్, వాణి భోజన్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందని తెలిపారు. అంతేకాదు త్వరలో చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ విడుదలపై అప్‌డేట్ ఇస్తామని కూడా చెప్పారు.

కాగా వాణి భోజన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో విక్రమ్ కు జోడీగా సిమ్రాన్ నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బాబీ సింహా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 6 =