
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 2


'పుష్ప' ఒక్క షాట్ కోసం 12 గంటలు

"తమ్ముడు" మూవీ పవన్ కళ్యాణ్ కే కరెక్ట్ - అజిత్

ఆనందంలో కార్తికేయ

పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ పై రాశీఖన్నా ఫోకస్

పొంగల్ బరిలో దిగిన 'వాలిమై'

'బంగార్రాజు' టీజర్ రిలీజ్

'భారతీయుడు 2' లో సూపర్ విలన్.!

ఏప్రిల్ లో విజయ్ 'బీస్ట్'..!

పంజాబీ డ్రెస్ లో కృతిశెట్టి బ్యూటీఫుల్ లుక్

"ఝాన్సీ"తెలుగు వెబ్ సిరీస్ లో అంజలి

విశ్వక్ సేన్ కు కరోనా పాజిటివ్..!

రష్మిక 5 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

'సలార్'.. పొంగల్ తర్వాతే కొత్త షెడ్యూల్..!

'భోళా శంకర్'.. చిరు న్యూ ఇయర్ సర్ ప్రైజ్

అర్జున ఫల్గుణ మూవీ పబ్లిక్ టాక్

'బంగార్రాజు' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

వాయిదా పడ్డ దుల్కర్ 'సెల్యూట్'
కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ సినిమా రిలీజ్ ల వాయిదాల పర్వం మొదలైంది. ఒకదాని తర్వాత ఒక సినిమా పోస్ట్ పోన్ అవుతున్నాయి. పెద్ద సినిమాలే అనుకుంటే చిన్న సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేకపోవడం.. థియేటర్లలో ఆక్యూపెన్సీ తగ్గించడం.. కొన్ని చోట్ల అయితే ఏకంగా థియేటర్లు మూత పడటంతో ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసి నష్టపోవడం కంటే కొంచం లేట్ అయినా తరువాత రిలీజ్ చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అందుకే పరిస్థితులు కాస్త నార్మల్ స్థితికి వచ్చాకే సినిమాలు రిలీజ్ చేస్తామని చెబుతున్నారు.

'పుష్ప' ఒక్క షాట్ కోసం 12 గంటలు
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప తో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈసినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకున్నందుకు బన్నీని ఇప్పటికే అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అన్ని పాటలు ఎంత హిట్ అయ్యాయో చూశాం. ఇక వీటిలో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట గుర్తుండే ఉంటుంది కదా. ఈ పాటలో బన్నీ ఒక్క షాట్ లోనే చాలా గెటప్స్ లలో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ షాట్ తీయడానికి చాలా కష్టపడ్డాడట బన్నీ. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి మరీ తెలిపింది.

"తమ్ముడు" మూవీ పవన్ కళ్యాణ్ కే కరెక్ట్ - అజిత్
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్ పై పి ఎ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ "తమ్ముడు " మూవీ 1999 జూలై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ప్రీతీ జింగానియా కథానాయిక. పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దర్శకుడు అరుణ్ ప్రసాద్ "తమ్ముడు" మూవీని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రమణ గోగుల సంగీతం ప్రేక్షకులను అలరించింది.

ఆనందంలో కార్తికేయ
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉండగా కొవిడ్ -19 కారణంగా విడుదల వాయిదా పడింది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా…

పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీ ఫిబ్రవరి 4 వ తేది రిలీజ్ కానుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్", మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ "భోళా శంకర్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో చిరంజీవి 154 మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ హీరో గా "భీమ్లా నాయక్", "హరి హర వీరమల్లు" మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బాలీవుడ్ పై రాశీఖన్నా ఫోకస్
సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు . పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , "భ్రమమ్ " మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

పొంగల్ బరిలో దిగిన 'వాలిమై'
ఈ సంక్రాంతికి చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే కదా. టాలీవుడ్ నుండే చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. నిజానికి ఈ సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ చాలా సినిమాలు రేస్ నుండి తప్పుకున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒక్కటే పాన్ ఇండియా రేంజ్ సినిమా. ఇక ఇప్పుడు ఈ రేసులోకి వాలిమై సినిమా కూడా వచ్చింది.ఇక బంగార్రాజు ఇంకా ఒకటి రెండు మిగిలిన సినిమాలు తప్పా అన్నీ దాదాపు చిన్న సినిమాలే. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాలిమై పోటీకి దిగుతుంది. రాధేశ్యామ్ జనవరి 14న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే అంటే జనవరి 13న…

'బంగార్రాజు' టీజర్ రిలీజ్
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఆసినిమాలో నాగ్ బంగార్రాజు పాత్రలో చాలా యాక్టీవ్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఆపాత్ర పేరు మీదే ఇప్పుడు దీని సీక్వెల్ గా సినిమా తీస్తున్నారు. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

'భారతీయుడు 2' లో సూపర్ విలన్.!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా మధ్యలో ఆగిపోవడానికి కారణాలు ఏంటో కూడా తెలుసు. కమల్ వల్ల కొన్ని రోజులు గ్యాప్ వస్తే.. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం వల్ల మరికొన్ని రోజులు..ఇక కరోనా వల్ల మొత్తానికే బ్రేక్ పడింది. ఈగ్యాప్ లో లైకాకు, శంకర్ కు మధ్య వివాదాలు రావడం.. అవి కూడా క్లియర్ అవ్వడం జరిగాయి. మొత్తానికి త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేయనున్నారు.

ఏప్రిల్ లో విజయ్ 'బీస్ట్'..!
మాస్టర్ సినిమాతో ఈ ఏడాదిని స్టార్ట్ చేసిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా చేస్తున్న సినిమా బీస్ట్. ఈసినిమా విజయ్ కెరీర్ లో వస్తున్న 65వ సినిమా. ఇక సినిమా ఇప్పటికే ఈసినిమా నుండి విజయ్ కు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈసినిమా కూడా సంక్రాంతికి వస్తుందేమో అని అనుకున్నారు. కానీ షూటింగే చాలా లేట్ అయింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించారు. ఇప్పుడు విడుదల…

అమెజాన్ లో 'కొండపొలం'.. నెటిజన్స్ నుండి సూపర్ రెస్పాన్స్
ప్రస్తుతం ఆడియన్స్ సినిమాలను చూసే విధానం మారిపోయింది. ఒకప్పుడు కమర్షియల్ ఎలిమెంట్సే ఎక్కువగా ఉండే సినిమాలు ఎక్కువ హిట్ అయ్యేవి. హీరో ఫైట్స్ చేసి.. హీరోయిజం చూపించి, ఆరు పాటలు ఉండే సినిమా హిట్ అనుకునే రోజులు పోయాయి. కానీ ఇప్పుడు అలా కాదు.. కొత్తగా డైరెక్టర్స్ ఏది ట్రై చేసినా ఆడియన్స్ వాటిని కూడా ఆదరించడానికి రెడీగా ఉన్నారు. అందుకే హీరో ఎలాంటి హడావుడి లేకుండా సినిమాలు తీసినా హిట్స్ అందుతున్నాయి. చిన్న సినిమాలు అయినా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఫైనల్ గా సినిమాలో ఎంత కంటెంట్ ఉంది.. ఎంత కొత్తగా ఉంది అని మాత్రమే చూస్తున్నారు.

2021 టాప్ 10 తెలుగు సాంగ్స్
పవన్ సిహెచ్ స్వరకల్పన లో సుద్దాల అశోక్ తేజ రచన మంగ్లీ గానం చేసిన, సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన "సారంగ దరియా" సాంగ్ 352 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసి అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్ గా నిలిచింది.

పంజాబీ డ్రెస్ లో కృతిశెట్టి బ్యూటీఫుల్ లుక్
బ్లాక్ బస్టర్ "ఉప్పెన"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "ఉప్పెన "మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. కృతి శెట్టి ఒక కథానాయికగా రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” మూవీ ఘనవిజయం సాధించింది. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

"ఝాన్సీ"తెలుగు వెబ్ సిరీస్ లో అంజలి
తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అంజలి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ లో అంజలి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అంజలి ప్రస్తుతం “ఆనందభైరవి “, “F 3 “, “పూచండి “(తమిళ ), “శివప్ప “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న "#RC15 ?మూవీ లో ఒక కీలక పాత్రకు అంజలి ఎంపిక అయినట్టు సమాచారం.

విశ్వక్ సేన్ కు కరోనా పాజిటివ్..!
టాలీవుడ్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గానే మంచు మనోజ్ కు కరోనా నిర్థారణ అవ్వగా.. ఇప్పుడు మరో యంగ్ హీరోకు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఆహీరో ఎవరో కాదు విశ్వక్ సేన్. ఈ విషయాన్ని స్వయంగా హీరో విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా వేదికగా తెలియచేశాడు. నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం డాక్టర్ల సూచనల మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నాను. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా వచ్చింది.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు…

రష్మిక 5 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” (2016)కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న బ్లాక్ బస్టర్ "ఛలో "(2018 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు." గీత గోవిందం " , "సరిలేరు నీకెవ్వరు", "భీష్మ ", "పుష్ప :ది రైజ్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "సుల్తాన్ " మూవీ తో కోలీవుడ్ కు రష్మిక పరిచయం అయ్యారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ "మిషన్ మజ్ను " 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది.

'సలార్'.. పొంగల్ తర్వాతే కొత్త షెడ్యూల్..!
బాహుబలి, సాహో సినిమాల తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్. వీటిలో రాధేశ్యామ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇక సెట్స్ పైన మరో సినిమా సలార్ ఉంది . ఈసిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ హీరో అవ్వడం.. అలానే ‘కె.జి.యఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి.

'భోళా శంకర్'.. చిరు న్యూ ఇయర్ సర్ ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత మాత్రం ఫుల్ బిజీ అయిపోయారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన చిరు అది సూపర్ హిట్ అవడంతో వెంటనే సైరా తీయగా అది కూడా మంచి హిట్ నే అందించింది. ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చిరు నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4, 2022న విడుదల కానుంది ఈ చిత్రం.

అర్జున ఫల్గుణ మూవీ పబ్లిక్ టాక్
Just saw Arjuna Phalguna 🔥 Blockbuster Hit Sree Vishnu acting was on point. Great action , romance , comedy Totally must watch movie 🔥💯 2021 ending with a…

'బంగార్రాజు' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
కింగ్ నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా బంగార్రాజు. ఇక వీరిద్దరి కాంబినేషన్ ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూడాలా అని అక్కినేని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకుతగ్గట్టే బంగార్రాజు కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడానికే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి బరిలోకి దిగనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నా దీనిపై మాత్రం ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం అయితే రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. మరోవైపు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే…