టాలీవుడ్ లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గానే మంచు మనోజ్ కు కరోనా నిర్థారణ అవ్వగా.. ఇప్పుడు మరో యంగ్ హీరోకు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఆహీరో ఎవరో కాదు విశ్వక్ సేన్. ఈ విషయాన్ని స్వయంగా హీరో విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా వేదికగా తెలియచేశాడు. నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం డాక్టర్ల సూచనల మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నాను. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా వచ్చింది.. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు, సోషల్ డిస్టెన్స్ పాటించండి.. అంటూ విశ్వక్ సేన్ పోస్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే.. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో గామి సినిమా కూడా చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























