జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉండగా కొవిడ్ -19 కారణంగా విడుదల వాయిదా పడింది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Watching his movies since childhood, not even in my wildest dreams I’ve imagined that I would be in a poster with #AjithKumar Sir😍
Now, the time has come for me to share the screen space with the man himself & here’s a telugu poster of us both in #Valimai 🔥
#ValimaiFromJan13 pic.twitter.com/l5Fvlrrekk
— Kartikeya (@ActorKartikeya) January 4, 2022
హీరో అజిత్ , విలన్ కార్తికేయ పోటీ పడి నటించిన “వాలిమై”మూవీతో కార్తికేయ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. హీరో అజిత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న కార్తికేయ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచీ అజిత్ మూవీస్ చూస్తూ పెరిగాననీ , హీరో అజిత్ తో ఒక పోస్టర్ లో ఉండాలని ఊహించుకొనేవాడిననీ , ఇప్పుడు “వాలిమై ” మూవీ తో ఆ కోరిక నెరవేరిందనీ , అజిత్ తో కలసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ కార్తికేయ ట్వీట్ చేశారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: