‘భోళా శంకర్’.. చిరు న్యూ ఇయర్ సర్ ప్రైజ్

Chiranjeevis Bholaa Shankar Movie Team Gives A New Year Surprise, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021, Bholaa Shankar Team New Year Surprise, Bholaa Shankar Movie, Bholaa Shankar Movie Updates, Bholaa Shankar Telugu Latest Movie Updates, Bholaa Shankar Telugu Movie, Bholaa Shankar Telugu Movie Update, Chiranjeevi Bholaa Shankar, Chiranjeevi Bholaa Shankar Telugu Movie,Chiranjeevi, Chiranjeevi New Movie Update, Bholaa Shankar Movie Update

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత మాత్రం ఫుల్ బిజీ అయిపోయారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన చిరు అది సూపర్ హిట్ అవడంతో వెంటనే సైరా తీయగా అది కూడా మంచి హిట్ నే అందించింది. ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం చిరు నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4, 2022న విడుదల కానుంది ఈ చిత్రం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇక భోళాశంకర్ సినిమా విషయానికొస్తే ఈసినిమా షూటింగ్ ను కూడా ఇప్పటికే మొదలుపెట్టాడు చిరు. తాాజాగా ఈసినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు న్యూ ఇయర్ కానుకగా శనివారం ఉదయం 9 గంటలకు స్వాగ్ అఫ్ భోళా అంటూ ఈసినిమానుండి చిరుకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నారు.

కాగా వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =