అప్పుడు ‘రైడ్’ కి కలిసొచ్చింది – ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ కి

Natural Star Nani Wishes All The Best For Alludu Adhurs Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Nani,Hero Nani,Actor nani,Alludu Adhurs,Alludu Adhurs Movie,Alludu Adhurs telugu Movie,Alludu Adhurs Movie Telugu,Alludu Adhurs Movie release,Natural Star Nani Wishes Alludu Adhurs Movie Team,Alludu Adhurs Movie Team,Natural Star Nani Best Wishes To Alludu Adhurs Movie Team,Natural Star Nani Wishes To Alludu Adhurs Movie,Natural Star Nani Latest News,Nani On Alludu Adhurs Movie Team

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమా ట్రయిలర్ ను కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సాయి శ్రీనివాస్ కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఈసారి కామెడీపై కూడా ద్రుష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. మంచి కామెడీ యాంగిల్ ను కూడా బయటపెట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ ను నాని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. నేను అష్టా చమ్మా సినిమా తర్వాత రైడ్ చేసాను.. అయితే ఆ సినిమా చేసేప్పుడు నేను ఈ సినిమా చేయనని బెల్లంకొండ సురేష్ గారికి చెప్పాను.. కానీ ఆయన మాత్రం నా మాట వినలేదు.. సినిమా చేయాలసిందే అని పట్టుపట్టారు.. అప్పుడు ఆయన బలవంతం మీద ఆ సినిమా చేశాను సినిమా హిట్ అయింది.. నా కెరీర్ కు కూడా ఆ సినిమా బాగా కలిసొచ్చింది.. ఇక ఇప్పుడు సాయి అల్లుడు అదుర్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయమని అడిగారు. అయితే ఆ టైంకి ప్రసాద్ ల్యాబ్స్‌లో షూటింగులో ఉంటానని చెప్పాను. ఇక ఇప్పుడు కూడా ఆయన నా మాట వినలేదు.. ఇక్కడకు వచ్చి మరీ నాతో ట్రైలర్ రిలీజ్ చేయించారు.. ఇక ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా కలిసి వచ్చేలా అనిపిస్తుందని అన్నారు. మరి చూద్దాం నాని సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో..

కాగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నభానటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్‌గా నటిస్తుండగా… సోనూసూద్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు… గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + five =