‘ఆచార్య’ అద్భుతమైన టెంపుల్ సెట్

Mega Star Chiranjeevi Is All Praises For Magnificent Temple Set Constructed For Acharya Movie On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Star Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Acharya,Acharya Movie,Acharya Film,Acharya Movie Latest updates,Acharya telugu Movie,Acharya Movie Telugu,Magnificent Temple Set Constructed For Acharya Movie,Mega Star Chiranjeevi Acharya Temple Set,Acharya Movie Temple Set,Temple Set Acharya,Chiranjeevi New Post

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో భారీ టెంపుల్ టౌన్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 20 ఎకరాల్లో ఈ సెట్ వేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సెట్ కు సంబంధించిన వీడియోను ఒకటి చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఈ సెట్ వేసిన వారిని.. దానికి సంహరించిన వారిని ప్రశంసించారు. ‘ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్. 20 ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. అందులో భాగంగా గాలి గోపురం… ఆశ్చర్యం గొలిపేలా ప్రతి దాన్ని అద్భుతంగా మలిచారు. ఇది కళా దర్శకత్వ ప్రతిభకే ఒక మచ్చుతునక. నాకెంతో ముచ్చట అనిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనుకున్నాను. నిజంగానే ఓ టెంపుల్ టౌన్ లో ఉన్నామా అనే విధంగా ఈ సెట్ ను రూపొందించిన కళా దర్శకులు సురేశ్ ని, ఈ టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన డైరెక్టర్ కొరటాల శివని, దీన్ని ఇంత అపురూపంగా నిర్మించడానికి అవసరమైన వనరులను ఇచ్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేక్షకులకు కూడా ఈ టెంపుల్ టౌన్ ఒక ఆనందానుభూతిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు’ అని చిరు తెలిపారు.

ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఒక‌వైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 6 =