సోనూసూద్ గురించి ఇప్పుడు తెలియని వారు ఎవరు వుంటారు. అడిగినవారికి.. అడగని వారికి సైతం సాయం చేస్తూ తన ఔదార్యాన్ని చూపిస్తున్నాడు. లాక్ డౌన్ లో ఎంతోమందికి సాయం చేసిన సోనూసూద్ లాక్ డౌన్ తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సోనూసూద్ సాయం పొందిన వారు చాలామంది వున్నారు. ఇప్పుడు మరోసారి తన ఉదార మనసునుచాటాడు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సోనూసూద్ “ఆచార్య” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆచార్య సెట్ లో పని చేస్తున్న పేద వర్కర్లకు మొబైల్స్ పంచి పెట్టాడు. ‘ఆచార్య’ సినిమా యూనిట్ సభ్యులకు మొబైల్ ఫోన్స్ గిఫ్ట్‌గా ఇచ్చి మరోసారి తన చేతికి ఎముక లేదని నిరూపించుకున్నారు. మొత్తం 100మంది వర్కర్లకు సోనూ మొబైల్స్ పంచి పెట్టాడు.
కాగా లాక్ డౌన్ వేళ సోనూ సూద్ సేవా కార్యక్రమాలతో ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లో ఉపాధికోసం సొంత ఊర్లను వదిలి వచ్చిన వలస కూలీలను తన డబ్బులతో స్వగ్రామాలకు పంపించాడు. అంతే కాకుండా వారికి దగ్గరుండి భోజనాలు సైతం ఏర్పాటు చేసాడు. మరోవైపు నీట్ పరీక్షకు వెళ్ళడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి వారికి స్పెషల్ ట్యాక్సీలు ఏర్పాటు చేశాడు. ఏపీలో ఓ రైతు ట్రాక్టర్ పంపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో. మరి ముందుముందు కూడా ఇలానే పేదవారికి సాయ పడుతూ ఉండాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)