అమెజాన్ ప్రైమ్ లో రానున్న ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’

Varsha Bollamma and Anand Deverakonda's Youthful Love Entertainer Middle Class Melodies To Come Out Through Amazon Prime Video

పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే చిన్న సినిమాలు మాత్రం ఓటీటీలో రిలీజ్ కే మొగ్గుచూపుతున్నాయి. త్వరలోనే థియేటర్స్ ఓపెన్ చేస్తున్నాకానీ 50 పెర్సెంట్ సిట్టింగ్ కు మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్నారు. మరి పెద్ద సినిమాలకు అయితే ఇది కొంచం వర్క్ అవుట్ అవుద్దేమో కానీ.. చిన్న సినిమాలకు మాత్రం కొంచం కష్టమే. ఎందుకంటే చిన్న సినిమాలకు మొదట జనాలు రావడమే కష్టం.. ఒకవేళ సినిమా కనుక మంచి టాక్ ను తెచ్చుకుంటే ఇక ఆ సినిమాకు తిరిగుండదు. అయితే అంత రిస్క్ తీసుకోడవం ఎందుకులే.. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ చేస్తేనే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ప్లాన్ చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ‘వి’, నిశ్శబ్దం సినిమాలు ఇప్పటికే రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. అది `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ లో వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

కాగా విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఆనంద్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.