గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి – సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . ఇటలీ , జార్జియాలలో షూటింగ్ జరుపుకున్న “రాధేశ్యామ్ ” మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“రాధేశ్యామ్ ” మూవీ ఫారిన్ షెడ్యూల్ బ్యాలెన్స్ షూటింగ్ కై హీరో ప్రభాస్ &టీమ్ ఇటలీ కి చేరుకున్నారు. తరువాత హైదరాబాద్ లో మరో షూటింగ్ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇటలీ లో జరిగే “రాధేశ్యామ్ ” మూవీ షూటింగ్ సెట్స్ లో హీరోయిన్ పూజాహెగ్డే జాయిన్ అయ్యారు. ఆ విషయాన్ని పూజాహెగ్డే “హలో ఇటలీ ” అంటూ ఇటలీ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ వీడియో క్లిప్ తో
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. “రాధేశ్యామ్ ” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: