అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్

Throwback Thursday: Megastar Chiranjeevi and Ram Charan Make One Of The Best On Screen Pairs Of Tollywood

సినీ చరిత్రలో మెగా ఫ్యామిలీకి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం ఎవరో కూడా అందరికీ తెలుసు. తెలుగు సినిమాకే కాదు.. మెగా ఫ్యామిలీకి కూడా ఒక మూలస్తంభం అయిన మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరుకి తనయుడు మెగా పవర్ స్టార్ కు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత దేశానికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత స్టార్, సూపర్ స్టార్ లైనా పిల్లలకు సాధారణ మనుషులే. మరి ఇక మెగా పవర్ స్టార్ రేంజ్ కు ఎదిగినా కూడా చిరు మాత్రం ఎప్పటికీ తనకు ముద్దుల కొడుకే. పలు సందర్భాల్లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మనకు తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని పిక్స్ ను చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 ఇక మెగా వారసుడిగా తెలుసు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చరణ్ మొదటి సినిమాతో సరైన విజయం దక్కించుకోలేక పోయినా.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. కెరీర్ మొదట్లో ఒక మూసలో సినిమాలు చేసిన.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇన్ని రోజులు మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసిన కాంబినేషన్ చిరు-చెర్రీది. వీరిద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడాలన్నది కేవలం మెగా ఫ్యాన్స్ కోరిక మాత్రమే కాదు.. చిరు సతీమణి.. చెర్రీ తల్లి సురేఖ కోరిక కూడా అదే. ఇప్పుడు ఇన్ని రోజులకు ఆచార్య సినిమాతో అది నెరవేరబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.

ఇక చరణ్ రాజ‌మౌళి క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.