ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీ – రేపు బిగ్ అనౌన్స్ మెంట్

Vyjayanthi Movies To Announce Some Interesting Update About Prabhas and Nag Ashwin Movie Tomorrow

అలా నిన్న ప్రభాస్ పుట్టిన రోజుకంటే ముందే బిగ్ సర్ ప్రయిజ్ ఉందని నాగ్ అశ్విన్ చెప్పాడో లేదో ఇలా వెంటనే అప్ డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు మాములు షాక్ ఇవ్వలేదు. పుట్టిన రోజు ముందు అంటే ఇంకా చాలా టైమే ఉంది అని లైట్ తీసుకున్నారు కానీ రేపు బిగ్ అన్నౌన్స్ మెంట్ ఉందని చెప్పి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా రేపు ఉదయం 10 గంటలకు బిగ్ సర్ప రైజ్ ఉందని తెలుపుతూ ట్వీట్ చేసారు. మరి ఆ అనౌన్స్ మెంట్ ఏమై ఉంటుందబ్బా అని అప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ క్యూరియాసిటీ తో వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.