నవంబర్ లో “RRR” షూటింగ్ లో అలియాభట్

Actress Alia Bhatt To Join RRR Movie Shooting In November

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్ తో “రౌద్రం రణం రుధిరం ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన “RRR” మూవీ షూటింగ్ 6నెలల తరువాత హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో టెస్ట్ షూట్ తో పునః ప్రారంభమయ్యింది. స్టార్ హీరోయిన్ అలియా భట్ నవంబర్ మొదటి వారంలో షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ మూవీ కై అలియా భట్ తెలుగు భాష నేర్చుకొనడం విశేషం. 60శాతం పైగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “RRR” మూవీ 2021 సంవత్సరం ఫస్టాఫ్ లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. దర్శకుడు రాజమౌళి , హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − six =