నాగ్ అశ్విన్ – ప్రభాస్ సినిమా కు సంబంధించి ఈ రోజు బిగ్ అనౌన్స్ మెంట్ ఇస్తామని చెప్పినదగ్గరనుండి ఏం అప్ డేట్ ఇస్తారబ్బా అని రాత్రి నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 10 ఎప్పుడు అవుతుందా అని రాత్రి నుండి గడియారం వంక అలా చూస్తూనే ఉండిపోయి ఉంటారు ప్రభాస్ అభిమానులు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరపడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో భారీ కాస్ట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెను హీరోయిన్ గా సెలెక్ట్ చేయిగా.. ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ ను ఎంపిక చేశారు. ఆ నటుడు ఎవరో కాదు బాలీవుడ్ నటుడు అమితాబ్. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు వైజయంతి మూవీస్ సంస్థ. ఒక లెజెండరీ నటుడు లేకుండా ఇంత భారీ సినిమా ఎలా తీయగలం అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు.
Welcoming with a full heart, the pride of a billion Indians. The Amitabh Bachchan. Our journey just got BIG-ger!https://t.co/bmG2GXBODh#NamaskaramBigB @SrBachchan 🙏#Prabhas @deepikapadukone @nagashwin7 @AshwiniDuttCh@SwapnaDuttCh @VyjayanthiFilms
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 9, 2020
ఇక బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు. పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: