ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో లెజెండ్ క్రికెటర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఆయనెవరో కాదు… సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అధికారికంగా ఈ బయోపిక్ లో ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు ప్రకటన వచ్చేసింది. తాజాగా చిత్ర బృందం మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. బయోపిక్‌లో తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తాడని, మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ త్వరలోనే రానుందని ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు.. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులోచూపిస్తారట.
1972లో శ్రీలంకలోని కాండీలో జన్మించిన ముత్తయ్య తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ క్రికెట్‌లో పత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1992 నుండి 2011 మధ్య శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1996లో తమ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం 133 టెస్టుల్లో అత్యధిక వికెట్లు (800) తీసిన ఆటగాడిగా మురళీధరన్ మొదటిస్థానంలో ఉన్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: