“మెంటల్ మదిలో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కోలీవుడ్ నటి నివేత పేతురాజ్ “చిత్రలహరి “, “బ్రోచేవారెవరురా “, “అల .. వైకుంఠపురములో .. “వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత కథానాయికగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. హీరో సాయితేజ , దేవాకట్టా కాంబినేషన్ మూవీ “#SDT 14″లో నివేత కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లాక్ డౌన్ తరువాత షూటింగ్స్ పునః ప్రారంభం కావడంతో హైదరాబాద్ కు చేరుకున్న నివేత , తాను సెట్స్ లో ఎలా ఉంటాననేది వివరించారు. తనది చిన్న పిల్లల మనస్తత్వం అనీ , పిల్లలు ఎక్కడికైనా వచ్చినప్పుడు మొదట్లో కామ్ గా ఉంటారనీ , ఆ తరువాత అల్లరికి అంతే ఉండదనీ , తాను కూడా అంతేననీ , సెట్స్ లోకి రాగానే కొంతసేపు సైలెంట్ గా ఉంటాననీ , తరువాత అందరితో కలసిపోతాననీ , ఆప్రభావం తో నటించిన సీన్స్ బాగా వస్తాయనీ నివేత చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























