మొత్తానికి మూడురోజులుగా జరుగుతున్న కెప్టెన్సి టాస్క్ బీబీ హోటల్ నిన్నటితో ముగిసింది. ఫైనల్ గా రెండు రోజులు సాగిన ఈ టాస్క్ లో అతిధుల టీమ్ గెలిచింది. గెస్ట్ టీం ఇవ్వాల్సిన 5 స్టార్స్ అభిజిత్ దగ్గరే ఉంచుకున్నాడు. ఐదు స్టార్ లు దొంగిలించి బిగ్ బాస్ కు మేమే గెలిచాం.. ఐదు స్టార్ లు మాదగ్గరే ఉన్నాయని చెప్పాడు అభిజిత్. దానికి బిగ్ బాస్ అతిథుల టీం ను ఎన్ని స్టార్ లు మీరు ఇచ్చారో చెప్పండి అని అడిగాడు. అందరూ కలిసి ఒక్క స్టార్ ఇచ్చినట్టు చెప్పారు. దీంతో బిగ్ బాస్ అతిథుల టీం గెలిచినట్టు ప్రకటించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గెలిచిన టీంలో బెస్ట్ పర్‌ఫార్మర్ ఎవరో నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ సూచించడంతో ఎవరికి వారు బెస్ట్ పర్‌ఫార్మర్ అనుకున్నారు. అయితే గేమ్‌కు ముందుకు పోవాలి కదా అని అరియానా మెహబూబ్‌కు సపోర్ట్ చేసింది. ఇక కాయిన్స్ టాస్క్ లో మొహబాబ్ కు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు తనకు సపోర్ట్ చేయమని సోహైల్ ని అడిగాడు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాదన జరిగిన తర్వాత ఫ్రెండ్‌షిప్‌కు విలువిస్తే నాకు సపోర్ట్ చెయ్ అని మెహబూబ్‌కు సోహైల్ చెప్పడంతో మిగతా వారు కూడా సోహైల్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో అతను కెప్టెన్ పోటీ దారులలో ఒకరిగా నిలిచాడు. ఇక ఇంటి సభ్యుల అందరిలో ఎక్కువ డబ్బు సంపాదించిన అఖిల్ రెండో కెప్టెన్ పోటీదారునిగా.. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లను చాకచక్యంగా పూర్తి చేసిన అవినాష్‌ను మూడో పోటీదారునిగా ఎంపిక చేశారు. ఇక వరస్ట్ పర్‌ఫార్మెర్ ఎవరని బిగ్ బాస్ అడగగా, దానికి అమ్మ రాజశేఖర్ తానే అని సమాధానం ఇచ్చాడు. దీంతో ఉల్లిపాయలు తరిగి స్టోర్ రూమ్‌లో పెట్టమన్నాడు.
ఇక ఈ కెప్టెన్సీ కోసం మంచు నిప్పు- మధ్యలో ఓర్పు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంకా ఈ టాస్క్ కు అభిజిత్ ను సంచలకునిగా వ్యవహరించమని చెప్పాడు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్స్ రెండు చేతులలో ఐస్‌తో కూడిన కప్పు పట్టుకొని కాళ్ళని వెడంగా ఉంచి నిలుచోవాలి. వారి కింద బొగ్గు మంట ఉంచారు. టాస్క్ మొదలు కాగా ముగ్గురు పోటీ దారులు చివర వరకు పోరాడారు. అఖిల్ ముందుగా పోటీ నుండి బయటకు వచ్చేయగా, ఆ తర్వాత అవినాష్ వచ్చేశాడు. దీంతో సోహైల్ ఈవారం కెప్టెన్ అయ్యాడు.
మరో వైపు మోనాల్ .. అఖిల్ దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిన అతను సైలెంట్‌గా ఉండడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డల్ గా ఉన్న అఖిల్ దగ్గరకు గంగవ్వ వచ్చి అతన్ని ఓదార్చింది. గంగవ్వ కూడా నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తంది. తిరిగే కాళ్ళు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాను , అన్నం కూడా పోతలేదు అని చెప్పుకొచ్చింది.
ఇక అవినాష్, సోహైల్, మెహబూబ్, అరియానాలు ఓ చోట కూర్చొని దివి హైట్ గురించి మాట్లాడుకుంటూ కొంచం సేపు నవ్వుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి లేచి మొత్తం తిరగగా అది చూసి అవినాష్, సుజాత, అరియానాలు కామెడీలు చేశారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ మళ్లీ ఏదో టాస్క్ ఇచ్చాడు. చూద్దాం మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)