విజువల్ వండర్ గా “రాధేశ్యామ్ “

Radhe Shyam Going To Be A Visual Wonder To Audience

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రాధేశ్యామ్ “మూవీ రూపొందుతుంది. భాగ్యశ్రీ , ప్రియదర్శి , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా “రాధేశ్యామ్ “మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1980 ల కాలంనాటి ప్రేమ కథ నేపథ్యంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో “రాధేశ్యామ్ “మూవీ విజువల్ వండర్ గా తెరకెక్కుతుంది. ఆ కాలం నాటి వాతావరణం లో , ఇటలీ లోని సుందర లొకేషన్స్ లో దర్శకుడు రాధాకృష్ణ చాలా స్టైలిష్ గా “రాధేశ్యామ్ “మూవీని తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న “రాధేశ్యామ్ “మూవీ సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nineteen =