‘వి’, నిశ్శబ్దం, రీసెంట్ గా మిస్ ఇండియా సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. అది `మిడిల్ క్లాస్ మెలోడీస్`. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్`. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా నుండి తాజాగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రొమాన్స్ ప్లస్ డ్రామా ప్లస్ లాఫ్టర్ తో తెరకెక్కుతున్నట్టు తెలుపుతున్నారు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ లో వెనిగళ్ళ ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Romance + Drama + Laughter = Recipe of Middle Class Melodies👀#MCMOnPrime, premieres November 20!@ananddeverkonda @VarshaBollamma @vinodanantoju #DivyaSripada @SweekarAgasthi @TharunBhasckerD @rhvikram @BhavyaCreations #AnandPrasad @adityamusic @KurapatiSunny pic.twitter.com/Jb12qUMl5D
— amazon prime video IN (@PrimeVideoIN) November 7, 2020
కాగా విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఆనంద్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: