చితక్కొట్టుడు 2 – గోష్ట్ వెర్ష‌న్ 2.0 టీజ‌ర్ రిలీజ్

Chithakkotudu 2 Ghost Version 2.0 Teaser Is Out

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంతోష్ పి జ‌య‌కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం చిత‌క్కొట్టుడు 2. దర్శకత్వంతో పాటు ఈ సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నాడు సంతోష్. త‌మిళ సినిమా ఇరాండ‌మ్ కూతుత్తు కి తెలుగు వెర్ష‌న్ గా చిత‌కొట్ట‌డు 2 రాబోతుంది. గ‌తంలో సంతోష్ పి జ‌య‌కుమార్ త‌మిళంలో తెరకెక్కించిన ఇర‌త్తు అరియిల్ మురత్తు కూత్తు, గ‌జ‌నీకాంత్ వంటి సినిమాలు క‌మ‌ర్షీయ‌ల్ సూప‌ర్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో చిత‌కొట్ట‌డు 2 ని గ‌తంలో వ‌చ్చిన అడ‌ల్ట్ హ‌రర్ కామెడీ ల కంటే మరింత ఎంట‌ర్ టైనింగ్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు దర్శకుడు సంతోష్ పి జ‌య‌కుమార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే విడుద‌ల చేసిన చిత‌కొట్ట‌డు 2 ఫ‌స్ట్ లుక్ లో రొమాంటిక్ ఆడియెన్స్ కి కావాల్సిన అంశాలు అన్నిటితో పాటు అడ‌ల్ట్ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండేలా డిజైన్ చేసి అనూహ్య స్పంద‌న అందుకున్న ద‌ర్శ‌కుడు సంతోష్ పి జ‌య‌కుమార్ అండ్ టీమ్, ఇప్ప‌డు ఈ సినిమా టీజ‌ర్ ని చాలా హాటెస్ట్ గా రెడీ చేశారు. ఈ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాలో సంతోష్ కి జోడిగా ఈ మూవీలో క‌రిష్మా, మీన‌ల్, ఆకృతి సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఫ్లైయింగ్ హార్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఎస్ హ‌రి భాస్కర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసుకుని త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.