‘కేస్‌ 99’ రానున్న ‘టిక్ టిక్ టిక్’ సాంగ్

Tik Tik Tik lyrical song from case 99 will be launched by Naga Chaitanya tomorrow

నిఖిల్‌ ,అనువర్ణ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శిని రామ్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘కేస్‌ 99’. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవసంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న నేపథ్యంలో ఆ ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ ఫైల్ అంటూ ఒక చిన్న టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ తో ముందుకు వచ్చేసారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి టిక్ టిక్ టిక్ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అక్కినేని వారసుడు నాగచైతన్య చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నారు.

 

ఇంకా ఈ సినిమాలో ‘పలాస’ఫేమ్‌ తిరువీర్‌, అపరాజిత, రోషన్, అజయ్,అశోక్‌రావ్,ప్రణీత పట్నాయక్‌ (కేర్‌ ఆఫ్‌ కంచెరపాలెం) , క్రిష్‌రాజ్,మనోజ్‌ ముత్యం,విజయ్‌ గోపరాజుతదితరులు నటిస్తున్నారు. మెలోడ్రామా అనే కంపెనీ ద్వారా గౌతమ్, కీర్తీ, వివేక్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − five =