సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజుకి అచ్చొచ్చిన సీజన్స్ లో సంక్రాంతి ఒకటి. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`(2013) మొదలుకుని `ఎవడు`(2014), `శతమానం భవతి`(2017), `ఎఫ్ 2` (2019) వరకు ముగ్గుల పండక్కి వచ్చిన ప్రతీ `దిల్` రాజు సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో.. రాజు నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన `సరిలేరు నీకెవ్వరు` కూడా సంక్రాంతి సీజన్ లోనే విడుదల కానుండడం.. పాజిటివ్ వైబ్స్ ని మరింతగా పెంచుతోంది. ఇక `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, `దిల్` రాజు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. `సరిలేరు నీకెవ్వరు`పై ఆ అంచనాలు రెట్టింపయ్యాయి.
మరి… ఇప్పటికే నాలుగు సార్లు `సంక్రాంతి` విజయాలు అందుకుని `సంక్రాంతి రాజు` అనిపించుకున్న `దిల్` రాజు… `సరిలేరు నీకెవ్వరు`తోనూ ఆ పరంపరని కొనసాగించి ఐదో పొంగల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
కాగా, రేపు (జనవరి 11) ప్రపంచవ్యాప్తంగా `సరిలేరు నీకెవ్వరు` థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























