సంక్రాంతి.. టాలీవుడ్ ఫరెవర్ బెస్ట్ సీజన్. అందుకే.. ఈ సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని అన్ని వర్గాల వారు ప్రయత్నాలు చేస్తుంటారు. శుభప్రదమైన ఈ పర్వదినంకి గత కొంతకాలంగా ఓ ప్రత్యేకత ఆపాదించబడుతోంది. అదేమిటంటే.. 2017 నుంచి ప్రతీ ఏడాది సంక్రాంతికి ప్రముఖులు `రీ-ఎంట్రీ` ఇవ్వడం ఆనవాయితీగా మారుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2017లో `ఖైదీ నంబర్ 150`తో మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం అనంతరం మోస్ట్ సక్సెస్ ఫుల్ రీ-ఎంట్రీ ఇస్తే… 2018లో `అజ్ఞాతవాసి`తో ఖుష్బూ అదే బాట పట్టింది. ఇక 2019లో `వినయ విధేయ రామ`తో నటి స్నేహతో పాటు ఒకప్పటి కథానాయకులు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ రీ-ఎంట్రీ చేశారు. కట్ చేస్తే.. 2020లోనూ ఆ పరంపర కొనసాగుతోంది.
జనవరి 11న రిలీజ్ అవుతున్న `సరిలేరు నీకెవ్వరు`తో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సుదీర్ఘ విరామం తరువాత రీ-ఎంట్రీ ఇస్తుంటే.. అదే సినిమాతో మరో సీనియర్ హీరోయిన్ సంగీత కూడా చాన్నాళ్ళ తరువాత తెలుగు తెరపై కనిపించబోతోంది. ఇక జనవరి 12న విడుదల కానున్న `అల వైకుంఠపురములో`తో టబు దాదాపు పుష్కరకాలం తరువాత టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోంది.
మరి.. పునరాగమానికి చిరునామాగా నిలుస్తున్న సంక్రాంతి సీజన్ లో.. ఈ సారి ఎవరెవరి రీ-ఎంట్రీకి `సక్సెస్` స్టాంప్ పడుతుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























