సినీ ఇండస్ట్రీలోకి వారసులుగా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెండి తెరకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది వారసులు రాగా ఇప్పుడు మరో వారసురాలు తెలుగు తెరపై రావడానికి సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు యాక్షన్ కింగ్ గా ఒకప్పుడు తనదైన శైలిలో సినిమాలు చేసి సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన అర్జున్ కూతురు ఐశ్వర్య. ఇప్పటికే తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. అయితే ఆ మధ్య తెలుగులో ఛాన్స్ వచ్చినా కూడా చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజా సమాచారం…ఐశ్వర్య తెలుగులో చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. డైరెక్టర్ ఎవరో కాదు అర్జునేనట. అర్జున్ తన సొంత ప్రొడక్షన్ లోనే ఆ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చి.. తెలుగులో మంచి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడట అర్జున్. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























