మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Mani Ratnam Dream Project Ponniyin Selvan Movie Completes Its First Schedule

ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి చారిత్రాత్మక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా “పొన్నియిన్ సెల్వన్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సుభాస్కరన్ సమర్పణ లో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సీనియర్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో చోళ రాజు రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా “పొన్నియిన్ సెల్వన్” తమిళ మూవీ 2భాగాలుగా రూపొందుతుంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్” మూవీ లో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, జయరామ్ , మోహన్ బాబు, ఆది, ఐశ్వర్యా రాయ్, త్రిష , ఇతర ప్రముఖులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ థాయ్ ల్యాండ్ డిసెంబర్ రెండవారం లో ప్రారంభం అయింది. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తమిళ భాషతో పాటు
తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్” మూవీ ఫస్ట్ పార్ట్ ఈ సంవత్సరంలోనే రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.