గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందిన “అల .. వైకుంఠపురములో .. ” మూవీ జనవరి12వ తేదీ రిలీజ్ కానుంది. “అల .. వైకుంఠపురములో .. ” మూవీ మలయాళ డబ్బింగ్ వెర్షన్ “అంగు వైకుంఠపురత్తు” అదే రోజు రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్ట్రాంగ్ డైలాగ్స్ తో, సెన్సిబుల్ స్క్రిప్ట్ రైటింగ్ తో మూవీస్ రూపొందించే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. త్రివిక్రమ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్ అని, ఒక గ్రేట్ స్క్రిప్ట్ తో సెట్స్ కు వస్తారని, షూటింగ్ బ్రేక్ టైమ్,సీన్ గ్యాప్ టైమ్ లో ఆ సీన్ ను డెవలప్ చేస్తారని, మనకి ఏదైనా కొత్త థాట్ వస్తే స్పాంటేనియస్ గా సీన్ ను ఇంప్రూవ్ చేస్తారని, త్రివిక్రమ్ డైలాగ్స్, డైరెక్షన్ మూవీ ని స్ట్రాంగ్ గా నిలబెడతాయని త్రివిక్రమ్ పై అల్లు అర్జున్ పొగడ్తల వర్షం కురిపించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: