2020 జనవరి… బాలీవుడ్ లో వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా మూడు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ సందడి చేయబోతున్నాయి. వాటిలో రెండు స్ట్రయిట్ పిక్చర్స్ కాగా, మరొకటి మల్టీలింగ్వల్ మూవీ. ఆ సినిమాలే.. `ఛపాక్`, `పంగా`, `నిశ్శబ్దం`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కథతో తెరకెక్కిన `ఛపాక్`(దీపికా పదుకొణే ప్రధాన పాత్రధారిణి) ఈ నెల 10న రిలీజ్ కానుంటే.. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఉమన్ సెంట్రిక్ మూవీ `పంగా` (కంగనా రనౌత్ ముఖ్య పాత్రధారిణి) ఈ నెల 24న విడుదల కానుంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన మల్టీలింగ్వల్ థ్రిల్లర్ మూవీ `నిశ్శబ్దం` ఈ నెల 31న హిందీతో సహా పలు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది. మరి.. మూడు వేర్వేరు వారాల్లో వస్తున్న ఈ మూడు విభిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే.. దీపిక, అనుష్క, కంగన.. ఈ ముగ్గురు కూడా గత జనవరి నెలల్లో ఘనవిజయాలు చూసిన వారే కావడం విశేషం. 2018 జనవరిలో `పద్మావత్`తో దీపిక, `భాగమతి`తో స్వీటీ విజయాలు చవిచూస్తే.. 2019 జనవరిలో రిలీజైన `మణికర్ణిక`తో కంగన కూడా అదే బాట పట్టింది. మరి.. ఈసారి జనవరి ఎవరెవరి దరికి సక్సెస్ ను చేరుస్తుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























