పవన్ ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్

#PSPK26, #VakeelSaab, latest telugu movies news, Pawan Kalyan New Look in Vakeel Saab, Pawan Kalyan Vakeel Saab First Look, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vakeel Saab, Vakeel Saab First Look, Vakeel Saab Movie Latest News, Vakeel Saab Movie Updates, Vakeel Saab Telugu Movie

ఫైనల్లీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎదురుచూపులు ఫుల్ స్టాప్ పడింది. పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ను ‘వకీల్ సాబ్’ అనుకుంటున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మొదటినుండి అనుకున్నట్టే ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చుని ఉన్న పవన్, తిరగేసిన మరో కుర్చీపై కాళ్లు ఆనించి ఉండటం ఫస్ట్ లుక్ లో కనబడుతుంది. ఇక ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక ఈ సినిమాలో నివేదా థామస్,అంజలి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. దిల్ రాజు, బోని కపూర్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.