నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుంది. ఇందులో నాని మూడు విభిన్న పాత్రల్లో దర్శనమిస్తాడని… అతనికి జోడీగా సాయిపల్లవి, రష్మికా మందన్న నాయికలుగా నటిస్తారని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `డబుల్ ఆస్కార్` విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ సంగీతమందించనున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఈ మేరకు సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ ఇన్ ఫర్మేషన్. త్వరలోనే రెహమాన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా `శ్యామ్ సింగ రాయ్` విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























