ఈ ఏడాది సంక్రాంతికి `ఎంత మంచివాడవురా`తో సందడి చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ నూతన దర్శకుడు మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఇదిలా ఉంటే… హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లోనూ కళ్యాణ్ రామ్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయనున్నాడని తెలిసింది. అంతేకాదు… ఇందులో కళ్యాణ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. ఇదివరకు నందమూరి కుటుంబంలో మహానటుడు యన్టీఆర్ `కుల గౌరవం`, `దాన వీర శూర కర్ణ` చిత్రాల్లోనూ, నటసింహ బాలకృష్ణ `అధినాయకుడు`లోనూ, యంగ్ టైగర్ యన్టీఆర్ `జై లవ కుశ`లోనూ త్రిపాత్రాభినయం చేశారు. మరి… తాత, బాబాయ్, తమ్ముడు బాటలోనే వెళ్ళనున్న కళ్యాణ్ రామ్ కూడా త్రిపాత్రాభినయంతో అలరిస్తాడేమో చూడాలి.
త్వరలోనే కళ్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























