నా చిప్స్ ప్రాబ్లమ్ ఉపాసన అర్ధం చేసుకుంది…!

Samantha Akkineni Thanks Upasana Kamineni For Gifting Her Most Favourite Snack As The Birthday Gift
Samantha Akkineni Thanks Upasana Kamineni For Gifting Her Most Favourite Snack As The Birthday Gift

సమంత పుట్టిన రోజు రెండు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. ఇక కరోనా వల్ల పుట్టిన రోజులు వేడుకలు జరుపుకోకపోయిన సోషల్ మీడియా వేదికగా మాత్రం సామ్ కు అందరి అభినందనలు అందాయి. ఇక సమంత కోసం చై స్పెషల్ గా కేక్ కూడా తయారు చేసాడు. ఇక ఇదిలా ఉండగా తాజాగా సమంతకు మరో సర్పరైజ్ అందింది. అదేంటంటే.. సమంతకు చిప్స్ అంటే చాలా ఇష్టం. ఇక ఈ లాక్ డౌన్ లో పాపం సమంత ఎక్కడ చిప్స్ కోసం బాధపడుతుందో అని ఉపాసన తన కోసం కొన్ని చిప్స్ పాకెట్స్ కొని పార్సిల్ చేసి పంపింది. ఇక ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ద్వారా తెలుపు తూ.. నేను నమ్మలేకపోతున్న.. నా చిప్స్ ప్రాబ్లమ్ నీకు గుర్తుందని.. నా ప్రాబ్లమ్ ను అర్ధం చేసుకొని నెలకు సరిపడా చిప్స్ పంపించినందుకు థ్యాంక్స్ లవ్ యూ ఉపాసన అని తెలిపింది. ఇక దీనిపై నెటిజన్స్ కూడా కామెడీ గా స్పందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సమంత బాలీవుడ్ లో ‘ ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ టీం కూడా సామ్ కు సర్పరైజ్ ఇచ్చారు. యూనిట్ నుండి ఒకరు చేయగా.. సామ్ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ఆ కాల్ లో దాదాపు ఈ వెబ్ సిరీస్ లో చేస్తున్న అందరూ ఉన్నారు. అందరూ హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడి విషెస్ చెప్పారు. ఇక ఈ విషయాన్ని కూడా సామ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

కాగా ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాలతో బిజీ గా వుంది. వీటితో పాటు వెబ్ సిరీస్ ఇంకా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.