ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‌తో చైతు, విక్రమ్ చిత్రం?

Creative Director Vikram Kumar Join Hands With Akkineni Naga Chaitanya Again After Blockbuster Movie Manam

‘మనం’(2014) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నాడని టాక్. కాగా, ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్ర‌చారం సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్టోరీలైన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ‘ఎవరైనా ఏ చిన్న సాయం చేసినా కృతజ్ఞత వ్యక్తం చేయడమన్నది మనిషి కనీస కర్తవ్యం’ అని నమ్మే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథతో ‘థాంక్యూ’ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

మరి, ‘మనం’ తరువాత చైతు, విక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్.. వారిద్దరి కెరీర్‌కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.