మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, దిగ్గజ దర్శకులు సి.యస్.రావు కలయికలో పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. అలాంటి అపురూప చిత్రాల్లో ‘పెత్తందార్లు’ ఒకటి. “తమ బ్రతుకులతో ఆటలాడుకునే నాయకులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు?”.. అన్న కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఇందులో యన్టీఆర్ సరసన విజయనిర్మల కథానాయికగా నటించారు. జోతీ సినీ సిండికేట్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాకరరెడ్డి, సావిత్రి, శోభన్‌బాబు, సంధ్యారాణి, నాగభూషణం, సత్యనారాయణ, నాగయ్య, రాజబాబు, అల్లు రామలింగయ్య, ధూళిపాల, రేలంగి, ముక్కామల, రావు గోపాలరావు, హేమలత, విజయలలిత, జ్యోతిలక్ష్మి, బేబీ రాణి ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర, దాశరధి, కె.అప్పారావు గీతరచనకు దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ బాణీలు సమకూర్చారు. “దగ్గరగా ఇంకా దగ్గరగా”, “మానవుడా ఓ మానవుడా”, “మైమరపో తొలి వలపొ”, “ఏకాంతసేవకు”, “నా దేశం కోసం”, “రామకృష్ణుల కన్న దేశం”.. ఇలా ఇందులోని అన్ని పాటలు అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి. 1970 ఏప్రిల్ 30న విడుదలైన ‘పెత్తందార్లు’.. నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























