స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సునీల్ శెట్టి, జగపతి బాబు, బాబు సింహా,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న “పుష్ప ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విభిన్న కథాచిత్రాలను తెరకెక్కించే దర్శకుడు సుకుమార్ , లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దు కావడంతో “పుష్ప ” మూవీ కి తుది మెరుగులు దిద్దుతూ బిజీగా ఉన్నారు. సుకుమార్ మాట్లాడుతూ .. తనకు పుస్తక పఠనం ఎక్కువని, ఈ మధ్యనే తెలంగాణ సాయుధ పోరాటంపై ఒక బుక్ చదివానని, బ్లాక్ బస్టర్ “రంగస్థలం” మూవీ తరువాత సాయుధ పోరాటం నేపథ్యంలో ఒక మూవీ రూపొందించాలని అనుకున్నానని , వీలుపడలేదని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: