ఆర్ఎక్స్ 100 లాంటి కల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ తో సినిమా తీసి మంచి కమర్షియల్ కొట్టి కొట్టాడు అజయ్ భూపతి. ఇక ఆ తర్వాత అజయ్ కు చాలా అవకాశాలే వచ్చాయి.. పలు హీరోలు అజయ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే పరుశురాంకు మాత్రం ఇంతవరకూ రెండో సినిమా చేసే అవకాశం దక్కలేదు. అయితే ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో మొదట రవితేజ ను హీరోగా అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమానుండి రవితేజ తప్పుకున్నాడు. ఆ తర్వాత తాను పలువురు హీరోలకి చెప్పగా కొందరు డేట్స్ అడ్జెట్స్ చేయలేక నో చెప్పారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫైనల్ గా శర్వానంద్ ను ఫైనల్ చేసాడు. ఇక మరో హీరోగా సిద్ధార్ద్‌ని దాదాపు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. వైజాగ్ నేపథ్యంలో వినూత్న కథతో సాగే ఈ చిత్రం ఆర్ ఎక్స్ 100 తరహాలోనే ఉంటుందంటున్నాడు దర్శకుడు. ఇక ఇదిలా ఉండగా ఈ కథ వల్ల హీరోస్ ను సెలెక్ట్ చేయడం ఎంతకష్టమైందో చెప్తున్నాడు. కరోనా వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో వున్నారు. ఇక ఈ సందర్భంగా కార్తికేయ, అజయ్ భూపతి లైవ్ వీడియో లో పాల్గొనగా.. కార్తికేయ అజయ్ ను పలు ప్రశ్నించగా… అజయ్ వాటికి సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా విజయ్ తో సినిమా ఎప్పుడు అని అడగగా… విజయ్,నేను ఓ రెండు సార్లు మాట్లాడుకున్నాం.. కానీ ఆ తర్వాత ఇద్దరం బిజీ అయిపోయాం అని చెప్పాడు. ఇక విజయ్ ను నన్ను పెట్టి సినిమా తీయాలని అడుగుతున్నారు అని అడుగగా దానికి అజయ్.. ‘నా కెరియర్లో తొలి మల్టీ స్టారర్ .. చివరి మల్టీ స్టారర్ మహాసముద్రమే… ఏంటంటే ఇద్దరు హీరోలకు కథ రాయడం ఎంత కష్టమో.. దానిని సెట్స్ పైకి తీసుకెళ్లడం అంత కష్టం… ఆ కథను చెప్పి హీరోలను ఒప్పించడం మరో ఎత్తు’ అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. మొత్తానికి అజయ్ ఇంకా ఫ్యూచర్ లో ముల్టీస్టారర్ కథలు చేయడం కష్టమేనేమో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: