తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో ‘చాణక్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చెయ్యగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసారి గోపీచంద్ హిట్ కొట్టే ఛాన్సే కనిపిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయారు చిత్రయూనిట్. దసరా పండుగా నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ మరియు బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మరి వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న గోపీచంద్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి ఈసినిమా గోపీచంద్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: