ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో ‘డియర్ కామ్రేడ్’

Dear Comrade for consideration for Oscar entry, Dear Comrade Movie Updates, Dear Comrade Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vijay Deverakonda Dear Comrade lands a place in Oscar entries list, Vijay Deverakonda Dear Comrade Movie in Oscar Entry List, Vijay Deverakonda Latest News, Vijay Deverakonda New Movie News, Vijay Deverakonda Sets Another Standard

భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది… అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది… ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు అనుకున్న ఫలితం రాకపోయినా కూడా తాజాగా మరో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. ఇండియా నుండి ఆస్కార్ కు నామినేట్ అయ్యే సినిమా లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఇండియాలోనే వివిధ భాషల్లో సినిమాలను ఫిల్టర్ చేసి అందులో 28 సినిమాలను సెలెక్ట్ చేయగా ఆ లిస్టులో డియర్ కామ్రేడ్ కూడా చోటు దక్కించుకుంది. ఇక ఈ సెలెక్ట్ ఐన సినిమాలను స్క్రీనింగ్ చేసి వాటిలో బెస్ట్ మూవీస్ ను ఆస్కార్ అవార్డ్ రేస్ కు పంపిస్తారు. మరి అక్కడివరకు వెళ్లినా..? వెళ్లకపోయినా..? ఇక్కడ సెలక్టింగ్ ప్రాసెస్ లోకైనా ఎంట్రీ దక్కడం గొప్ప విషయమే కదా..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here