మొత్తానికి ఇన్నిరోజులకు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. గతకొద్దికాలంగా ఎన్టీఆర్ హీరోయిన్ ను ఎవరికి సెలెక్ట్ చేస్తారా..? ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ ఎవరికి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఒలివియా మోరిస్ కు స్వాగతం. మా సినిమాలో మీరు ప్రధాన పాత్ర అయిన ‘జెన్నిఫర్’ పాత్రను పోషిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. షూట్ కోసం ఎదురు చూస్తున్నాము’ అని పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన ‘స్కాట్’ పాత్ర కోసం ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ ను తీసుకున్నారు. లేడీ విలన్ పాత్ర కోసం సీనియర్ యాక్ట్రెస్ ఆలిసన్ డూడిని ఎంపిక చేసుకున్నారు.
Welcome aboard #OliviaMorris @OliviaMorris891! We are happy to have you play the female lead #JENNIFER. Looking forward for the shoot. #RRRMovie #RRR. pic.twitter.com/7ZUtyLt6bq
— RRR Movie (@RRRMovie) November 20, 2019
#RayStevenson, it’s a pleasure to have you play the lead antagonist #SCOTT in #RRRMovie. Can’t wait to begin shooting with you. #RRR. pic.twitter.com/T0nZnHlMxy
— RRR Movie (@RRRMovie) November 20, 2019
Welcome to Indian cinema, #AlisonDoody! Had a wonderful time shooting for your first schedule… We are glad to have you play lead antagonist #LADYSCOTT in #RRRMovie! #RRR pic.twitter.com/ELNUUS0g32
— RRR Movie (@RRRMovie) November 20, 2019
కాగా బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: