నాగ‌చైత‌న్య‌కి విల‌న్ గా అజ‌య్ భూప‌తి?

Director Turns Villain For Naga Chaitanya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya Upcoming Movie News,Naga Chaitanya Next Film Updates,Naga Chaitanya Latest Movie Details

గ‌త ఏడాది సంచ‌ల‌నం `ఆర్ ఎక్స్ 100`తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు అజ‌య్ భూప‌తి. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే నిర్దేశ‌కుడిగా మ‌న్న‌న‌లు పొందిన ఈ టాలెంటెడ్ టెక్నీషియ‌న్… త్వ‌ర‌లో ప్ర‌తినాయ‌కుడి అవ‌తార‌మెత్తుతున్నాడ‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `ఆర్ ఎక్స్ 100` త‌రువాత త‌న రెండో చిత్రాన్ని మ‌ల్టీస్టార‌ర్ గా ప్లాన్ చేసిన అజ‌య్… త్వ‌ర‌లోనే ఆ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఒక క‌థానాయ‌కుడిగా యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య ఫిక్స్ అయ్యాడ‌ని టాక్‌. కాగా, నెగ‌టివ్ ట‌చ్ ఉన్న మ‌రో పాత్ర కోసం ప‌లువురు యువ క‌థానాయ‌కుల‌ను సంప్ర‌దించాడ‌ట అజ‌య్‌. అయితే, ఎంతో ఇంటెన్సిటీ ఉన్న ఆ క్యారెక్ట‌ర్ త‌మ‌కు న‌చ్చిన‌ప్ప‌టికీ… చేయ‌డానికి మాత్రం జంకుతున్నార‌ట‌. దీంతో… ఆ పాత్ర‌ని త‌నే చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట అజ‌య్‌. ఫ‌లితంగా… చైతూ పాలిట మ‌న అజ‌య్ విల‌న్ అయిపోతున్న‌ట్ల‌య్యింది.

గ‌తంలోనూ చాలామంది ద‌ర్శ‌కులు ఇలా యాదృచ్ఛికంగా న‌టులై సంచ‌ల‌నం సృష్టించిన సంద‌ర్భాలున్నాయి. మ‌రి… అజ‌య్ భూప‌తి కూడా అదే బాట‌లో వెళ‌తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − six =