
ట్యాగ్ · 22 కథనాలు


సూర్య 45 షూటింగ్ షురూ

సూర్య 45 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

షూటింగ్ లో గాయపడ్డ సూర్య

సూర్య 44 గ్లింప్స్ రిలీజ్

కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది

సూర్య 44-అండమాన్ లో టీం సందడి

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య

సూర్య సినిమాలో మలయాళ స్టార్ హీరో?

రజినీ మూవీలో సూర్య?

సూర్య 42 మూవీ తో దిశా పటాని కోలీవుడ్ ఎంట్రీ

సూర్య కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..!

తన సినిమాలో తానే అతిథి పాత్రలో..!

'బాలా' తో సినిమా రూమర్స్ పై 'సూర్య' క్లారిటీ..!

కన్ఫామ్.. విక్రమ్ మూవీ లో సూర్య..!

అక్షయ్ తో సూర్య ‘సూరరై పోట్రు’ రీమేక్

స్టార్ హీరో సూర్య కు జోడీగా కృతిశెట్టి

సూర్యతో పక్కా వర్క్ చేస్తా..!

"ఎవరికీ తలవంచడు "(ET) ప్రీ రిలీజ్ ఈవెంట్

సూర్య "ET"మూవీ టీజర్ రిలీజ్

సూర్య 44 టైటిల్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
'కంగువా' ఘనవిజయం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సూర్య 44' (వర్కింగ్ టైటిల్). తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. రీసెంట్ గానే ఆయన తన పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది.

సూర్య 45 షూటింగ్ షురూ
సినిమా సినిమాకు మినిమం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య.కంగువా అయిపోయిన వెంటనే 44 వ సినిమాను మొదలు పెట్టాడు.కంగువా రిలీజ్ అయ్యేలోపు సినిమాను ఫినిష్ చేశాడు.ఇక ఇప్పుడు 45వ సినిమా కూడా స్టార్ చేశాడు.ఈ రోజే ఈసినిమా పొల్లాచ్చి లో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది.ఆర్ జె బాలాజీ తెరకెక్కిస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నారు.

సూర్య 45 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమ బిగ్గెస్ట్ మూవీ 'సూర్య 45'ని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించనున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ యొక్క మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీగా నిలవనుంది.

షూటింగ్ లో గాయపడ్డ సూర్య
స్టార్ హీరో సూర్య షూటింగ్ లో గాయపడ్డాని తమిళ మీడియా వెల్లడించింది.ప్రస్తుతం పేట ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ తో సూర్య తన 44వ సినిమాను చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ ఊటీ లో జరుగుతుంది.అందులో భాగంగా యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్న సమయంలో సూర్య తలకు చిన్న దెబ్బ తగిలిందని దాంతో కొన్ని రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారట.త్వరలోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

సూర్య 44 గ్లింప్స్ రిలీజ్
స్టార్ట్ హీరో సూర్య ప్రస్తుతం తన 44వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా నుండి తన బర్త్ డే సందర్భంగా నిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అదిరిపోయింది.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.సూర్య లుక్ ,స్వాగ్ ఆకట్టుకున్నాయి.గ్లింప్స్ చూస్తుంటే సూర్య నుండి చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ రానుందనిపిస్తుంది.డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చేశాడు.ఓవరాల్ గా ఈ ప్రోమో అయితే సూర్య అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది.

కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే పలు పోస్టర్లు, టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

సూర్య 44-అండమాన్ లో టీం సందడి
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీనితో పాటు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ షాట్ అంటూ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సూర్య లుక్ ను చూపించారు.

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య
వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య.ప్రస్తుతం తను మచ్ అవైటెడ్ మూవీ కంగువాలో నటిస్తున్నాడు.సూర్య కెరీర్ లోనే హై బడ్జెట్ తో వస్తుంది ఈసినిమా.శివ డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.తెలుగులోకూడా ఈసినిమాకు సూపర్ హైప్ వుంది.త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్నారు.

సూర్య సినిమాలో మలయాళ స్టార్ హీరో?
డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో.. విభిన్నమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. భారీ బడ్జెట్ ఈసినిమా రాబోతుంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇక గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాని స్టూడియో…

రజినీ మూవీలో సూర్య?
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో…

సూర్య 42 మూవీ తో దిశా పటాని కోలీవుడ్ ఎంట్రీ
రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా , జై భీమ్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన హీరో సూర్య 42 వ మూవీ షూటింగ్ చెన్నై లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.యు వి క్రియేషన్స్ ,స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శివ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళ , తెలుగు భాషలలో భారీ బడ్జెట్, 3 D ఫార్మాట్ తో సూర్య 42 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో హీరో సూర్య కు జోడీగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని నటిస్తున్నారు. ఈ మూవీ తో దిశా పటాని కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు.

సూర్య కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..!
తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క విభిన్నమైన కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక వాటి ఫలితాలను చూస్తూనే ఉన్నాం. ఇక సూర్య పుట్టిన రోజుకు ఒకరోజు ముందు సూర్య సినిమాకు ఇన్ని జాతీయ అవార్డులు రావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక నేడు సూర్య తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్, సినీ సెలబ్రెటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

తన సినిమాలో తానే అతిథి పాత్రలో..!
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన సినిమా సూరరై పోట్రు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జిఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా సూరారై పోట్రు గా తెరకెక్కిన ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగులో ఈసినిమా ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. లాక్ డౌన్ లో ఈసినిమా రిలీజ్ అయింది. థియేటర్స్ లేని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

'బాలా' తో సినిమా రూమర్స్ పై 'సూర్య' క్లారిటీ..!
తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో.. తమిళ స్టార్ హీరో సూర్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సూర్య కెరీర్లో 41వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సముద్ర నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

కన్ఫామ్.. విక్రమ్ మూవీ లో సూర్య..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈసినిమా కోసం కమల్ హాసన్ అభిమానులు ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెండు వారాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక మొదటి నుండీ అనుకుంటున్నట్టే ఈసినిమా యాక్షన్ నేపథ్యంలో ఉండి ఆడియెన్స్ ని విపరీతంగా ఆట్టుకుంటుంది. ఇందులో కమల్ హాసన్ నట విశ్వరూపం మరోసారి చూపించారని చెప్పొచ్చు.

అక్షయ్ తో సూర్య ‘సూరరై పోట్రు’ రీమేక్
ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. తెలుగు, తమిళ్, కన్నడ మలయాళం సినిమాలు ఇండియన్ మార్కెట్ పై పెద్ద ఎఫెక్ట్ నే చూపిస్తున్నాయి. దీంతో సౌత్ సినిమాలకు నార్త్ లో కూడా మండి డిమాండ్ పెరిగింది. వరుసపెట్టి సౌత్ సినిమాలను నార్త్ లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు నార్త్ లో రీమేక్ అవ్వగా ఇప్పుడు మరో సౌత్ సినిమా కూడా రీమేక్ కు సిద్దమైంది.

స్టార్ హీరో సూర్య కు జోడీగా కృతిశెట్టి
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

సూర్యతో పక్కా వర్క్ చేస్తా..!
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆకాశం నీ హద్దురా..!, జై భీమ్ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఓ మాస్ మసాలా చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాండి రాజ్ దర్శకత్వంలో సూర్య ఈటీ సినిమా చేస్తున్నాడు.మార్చి 10 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తెలుగు లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు.

"ఎవరికీ తలవంచడు "(ET) ప్రీ రిలీజ్ ఈవెంట్
స్టార్ హీరో సూర్య కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సూర్య ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా!”, “జైభీమ్” ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య ఇప్పుడు”ఈటీ”(ఎతరుక్కుమ్ తునిందవన్) మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఈటీ”(ఎతరుక్కుమ్ తునిందవన్)తమిళ మూవీ , తెలుగు వెర్షన్ "ఎవరికీ తలవంచడు " మార్చి 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. డి ఇమాన్ సంగీతం…

సూర్య "ET"మూవీ టీజర్ రిలీజ్
స్టార్ హీరో సూర్య కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సూర్య ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా!", "జైభీమ్" ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య ఇప్పుడు"ఈటీ"(ఎతరుక్కుమ్ తునిందవన్) మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.