వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య.ప్రస్తుతం తను మచ్ అవైటెడ్ మూవీ కంగువాలో నటిస్తున్నాడు.సూర్య కెరీర్ లోనే హై బడ్జెట్ తో వస్తుంది ఈసినిమా.శివ డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.తెలుగులోకూడా ఈసినిమాకు సూపర్ హైప్ వుంది.త్వరలోనే రిలీజ్ డేట్ చెప్పనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా తరువాత సూర్య తన 43వ సినిమాను సుధ కొంగర డైరెక్షన్ లో చేయనున్నాడు.ఈ కాంబో పై కూడా భారీ అంచనాలు వున్నాయి.నిజానికి ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన సినిమా కానీ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్లనుంది.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటెర్టైమెంట్స్ ఈ సినిమా ను నిర్మించనుండగా దుల్కర్ సల్మాన్ ,నజిరియా నజీమ్,విజయ్ వర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూర్య.పేటా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ తో తన 44వ సినిమా చేయనున్నాడు. నిన్ననే ఈసినిమా ను అనౌన్స్ చేశారు.అయితే ముందస్తుగా ఎలాంటి లీకులు లేకుండా అనౌన్స్ చేసి సప్రైజ్ చేశారు.ప్రేమ,నవ్వు,యుద్ధం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కనుంది.2డి ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను నిర్మించనుంది.సూర్య 43 కన్నా ముందే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కూడా లేకపోలేదు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు రానున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: