సూర్య 44 టైటిల్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

Suriya44 Title Teaser Unveiling Date Announced

‘కంగువా’ ఘనవిజయం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. రీసెంట్ గానే ఆయన తన పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటివరకు ఈ సినిమా నుండి కేవలం గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. అయితే దీనికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనుండగా.. ఒక స్పెషల్ సాంగ్‌లో సీనియర్ హీరోయిన్ శ్రియ మెరవనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఒక కీలక అప్డేట్ అందింది. డిసెంబర్ 25న ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదలకానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు ఇక సూర్య ప్రస్తుతం తన 45వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆర్ జె బాలాజీ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ వచ్చే నెల 5నుండి కోయంబత్తూరు లో మొదటి షెడ్యూల్ జరుపుకోనుంది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో దీనిని రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.