‘బాలా’ తో సినిమా రూమర్స్ పై ‘సూర్య’ క్లారిటీ..!

Suriya gives clarity about movie with Director Bala,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Suriya,Hero Suriya,Suriya Latest Movies,Suriya Upcoming Movies,Suriya New Movie Updates,Suriya Latest Movies,Suriya About Director Bala,Director Bala, Director Bala Latest Movie Updates,Director Bala New Movie Updates,Director Bala and Suriya,Suriya Gives Clarity About Movie With Director Bala,Suriya Gives Clarity On Rumors About Moviw With Bala

తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో.. తమిళ స్టార్ హీరో సూర్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సూర్య కెరీర్లో 41వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సముద్ర నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదటి పెట్టి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు ఇటీవలే చిత్రయూనిట్ అధికారికంగా కూడా తెలిపింది. మరో షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈగ్యాప్ లో కొద్ది రోజులుగా ఈ సినిమా నిలిచిపోయిందా అంటూ వార్తలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేయడం మొదలుపెట్టాయి. ఇక ఈ రూమర్లకు తాజాగా తన ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు సూర్య. బాలాతో సినిమా లొకేష‌న్‌లో ఉన్న‌పుడు తీసిన ఫొటోను షేర్ చేస్తూ.. మళ్లీ సెట్ పైకి రావడానికి ఈగర్ గా వెయట్ చేస్తున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో ఈసినిమాపై వస్తున్న రూమర్లకు ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేశాడు.

కాగా ఈసినిమాలో ఇప్పటికే టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ ను కూడా తీసుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమాను 2డి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్యోతిక నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + nine =