తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీనితో పాటు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ షాట్ అంటూ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సూర్య లుక్ ను చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అండమాన్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతుండగా ..అక్కడ రెండు పాటల షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్ జులై ఫస్ట్ వీక్ వరకూ పూర్తి అవుతుందని.. నెక్ట్స్ షెడ్యూల్ ఊటీలో మొదలుపెట్టనున్నట్టు సమాచారం.
కాగా ఈసినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళం నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈసినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్‌తో కలిసి సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్ భారీగా నిర్మిస్తుంది. సంతోష్‌నారాయణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































