సినిమా సినిమాకు మినిమం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య.కంగువా అయిపోయిన వెంటనే 44 వ సినిమాను మొదలు పెట్టాడు.కంగువా రిలీజ్ అయ్యేలోపు సినిమాను ఫినిష్ చేశాడు.ఇక ఇప్పుడు 45వ సినిమా కూడా స్టార్ చేశాడు.ఈ రోజే ఈసినిమా పొల్లాచ్చి లో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది.ఆర్ జె బాలాజీ తెరకెక్కిస్తుండగా త్రిష కథానాయికగా నటిస్తుంది.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కన్నా ముందు సూర్య తన 44వ సినిమా తో రానున్నాడు.కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సూర్య లుక్ కూడా డిఫ్రెంట్ గా ఉండనుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు.దీనికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీయ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.2డి ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది.వచ్చే ఏడాది వేసవి లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.త్వరలోనే టైటిల్ ఏంటో చెప్పనున్నారు.
ఇక సూర్య నటించిన కంగువా ప్రస్తుతం థియేటర్లలో వుంది.ఫుల్ రన్ లో 200కోట్ల మార్క్ ను చేరుకోనుంది.శివ ఈసినిమాను డైరెక్ట్ చేయగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్,యూవీ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: